![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -997 లో......రెండు రోజుల్లో ఇందు పుట్టినరోజు తను పెట్టె సంతకంతో దుగ్గిరాల ఆస్తులు మొత్తం రేఖకి వెళ్ళిపోతాయ్.. సంతకం పెట్టకని సుభాష్, అపర్ణ అంటుంటే సంతకం పెట్టకపోతే ఏం చేస్తుందోనని ఇందు టెన్షన్ పడుతుంది. కాసేపటికి ఇందు, స్వాతి మాట్లాడుకుంటారు. పక్కనే ఉన్న ఐశ్వర్య చూసి ఇప్పుడు దీన్ని రేఖ ఆంటీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. దీన్ని కిడ్నాప్ చేసి డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తే నా ఫ్రెండ్ అప్పు మొత్తం కట్టేయొచ్చని ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది.
అప్పుడే ఐశ్వర్యకి లక్కీ నుండి హాయ్ అని మెసేజ్ వస్తుంది. అది చూసి నా పని వీళ్లతోనే పూర్తి అవుతుందని అనుకుంటుంది. నిన్ను వెంటనే కలవాలి లాభం వచ్చే పని ఉందని ఐశ్చర్య చెప్తుంది. దానికి లక్కీ సరే అంటాడు. మరొకవైపు నందు బొకే షాప్ దగ్గరికి వెంకీ వస్తాడు. నా లవ్ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పారు కానీ చివరికి హ్యాండ్ ఇచ్చారని వెంకీ అంటాడు. నేను హెల్ప్ చెయ్యనని నందు అనగానే వెంకీ కోపంగా చేయకులే అని వెళ్తుంటాడు. తనని ఒక వెహికల్ డాష్ ఇచ్చి వెళ్తుంది. దాంతో అతను కిందపడిపోతాడు. వెంటనే నందు వచ్చి కట్టుకడుతుంది. నాకు హెల్ప్ చెయ్యనన్నావని వెంకీ అనగానే చేస్తానులే అని నందు చెప్తుంది. మరొకవైపు ఐశ్వర్య దగ్గరికి లక్కీ, రాజు వస్తారు. నిన్ను ఒక్కడినే రమ్మన్నాను కదా అని ఐశ్వర్య అనగానే.. ఏం చేసినా ఇద్దరం చేస్తామని లక్కీ చెప్తాడు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చెయ్యాలని ఐశ్వర్య అనగానే నీకు మేమ్ ఎలా కన్పిస్తున్నాం.. చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా చెయ్యమని తనపై రాజు సీరియస్ అవుతాడు.
ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతో ఐశ్వర్య డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు రాజు వాళ్ళ ఇంటికి స్మగ్లర్ సాహో వస్తాడు. అంతకుముందే అతనికి సంబంధించిన మత్తుపదార్థాలు రాజు పాడు చేసిన విషయం తెలిసిందే.. దాంతో రాజుని పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు సాహో. ఇప్పుడు ఏకంగా రాజు ఫ్రెండ్ ని అంటూ రాజు ఇంటికి వచ్చి తన పేరెంట్స్ తో మాట్లాడుతాడు. ఆ తర్వాత రాజు ఇంటికి వస్తాడు. అతన్ని అక్కడ చూసి షాక్ అవుతాడు. అప్పుడే వెంకీ దెబ్బలతో ఇంటికి వస్తాడు. అది మన పనే అని రాజుతో సాహో అంటాడు. రాజులో టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |